ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 15:39:18

టికెట్ల రిజ‌ర్వేష‌న్‌పై రైల్వేశాఖ క్లారిటీ

 టికెట్ల రిజ‌ర్వేష‌న్‌పై రైల్వేశాఖ క్లారిటీ

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ ఏప్రిల్ 14వ తేదీన ముగియ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే పోస్టు లాక్‌డౌన్ కాలానికి టికెట్ల బుకింగ్ జ‌రుగుతున్న‌ట్లు  రైల్వే శాఖ‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  దీనిపై ఇవాళ భార‌తీయ రైల్వే మంత్రిత్వ‌శాఖ‌ ఓ క్లారిటీ ఇచ్చింది.  లాక్‌డౌన్ త‌ర్వాత తేదీల‌కు సంబంధించిన టికెట్ల బుకింగ్ జ‌రుగుతున్న‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, నిజానికి ఏప్రిల్ 14వ తేదీ త‌ర్వాత జ‌రిగే ప్ర‌యాణాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు బుకింగ్ ప్ర‌క్రియ‌ను ఆప‌లేద‌ని రైల్వేశాఖ పేర్కొన్న‌ది.  అడ్వాన్స్‌డ్‌ రైల్వే రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ ప్ర‌కారం.. 120 రోజులు ముందుగానే బుక్ చేసుకోవ‌చ్చు అని,  ఆ ప్ర‌క్రియ ముందు నుంచే కొన‌సాగుతున్న‌ట్లు రైల్వేశాఖ చెప్పింది.  మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు కూడా బుకింగ్ ప్ర‌క్రియ ఆగ‌ద‌ని రైల్వే శాక త‌న ట్వీట్‌లో తెలిపింది.

 logo