శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 22, 2020 , 16:08:26

కుక్క‌పిల్ల సైజులో బొద్దింక‌.. ఇది నేల మీద ఉండ‌ద‌ట‌!

కుక్క‌పిల్ల సైజులో బొద్దింక‌.. ఇది నేల మీద ఉండ‌ద‌ట‌!

మామూలుగా ఇంట్లో బొద్దింక‌ల‌ను చూస్తేనే కెవ్.. మ‌ని అక్క‌డి నుంచి పారిపోతారు. అది కూడా చిన్న సైజులో ఉన్న బొద్దింక‌ను చూస్తేనే.. మ‌రి ఈ బొద్దింక ఏకంగా కుక్క‌పిల్ల సైజులో ఉంది. మ‌రి ఇలాంటి బొద్దింక‌ను చూస్తే మ‌న‌వాళ్ల‌కి నైట్ డ్రీమ్‌లోకి కూడా వ‌స్తుందేమో. ఆ రకంగా ఉంది ఈ బొద్దింక‌. నో ప్రాబ్ల‌మ్‌. ఇది నేల మీద జీవించ‌ద‌ట‌. స‌ముద్రంలోనే జీవిస్తుంది. అందుకే దీనికి 'సీ కాక్రోచ్' అనే పేరు వ‌చ్చింది. ఇలాంటి బొద్దింక‌లు గ‌నుక చైనా వాళ్ల కంట్లో ప‌డితే ఇక అంతే.. ఫ్రై చేసుకొని తినేయ‌డ‌మే ప‌ని.

సింగపూర్‌కు చెందిన పీటర్ ఎన్జీ ఆఫ్ నేషనల్ యూనివర్శిటీ చేపట్టిన మెరీన్ సర్వేలో సముద్రం అట్టడుగున నివసించే 12 వేల రకాల కీటకాలను కనుగొన్నారు. వాటిలో ఈ సముద్రపు బొద్దింక ఒకటి. పరిశోధకులు దీన్ని ప్రత్యేక జాతిగా గుర్తిస్తూ.. ‘జెయింట్ బాతినోమస్’ అని నామకరణం చేశారు. ఇది సుమారు 50 సెంటీ మీటర్ల వరకు ఎదుగుతుందట. అంతేకాదు దీనికి 14 కాళ్లు ఉంటాయి. పీతలు, రొయ్యలు తరహాలోనే ఇది కూడా ఒక రకమైన కీటకమని పరిశోధకులు తెలిపారు. ఈ బొద్దింక‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ విష‌యం తెలిసిన త‌ర్వాత నెటిజ‌న్లు చైనా వాళ్ల‌పై వ్యగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. 


 logo