చెన్నై, జూలై 13: శరీరంలో క్యాన్సర్‌ను వృద్ధి చేసే కణాల ఉత్పరివర్తనాలను కనుగొనే నమూనాను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశా రు. జన్యుక్రమాల సమాచారాన్ని విశ్లేషించి, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. శరీరంలోని కొన్ని కణాల ఉత్పరివర్తనాల వల్లే క్యాన్స ర్ వృద్ధి చెందుతుందని, వీటిని ‘డ్రైవర్ మ్యూటెషన్లు’గా పేర్కొంటారు. సాధారణంగా జరిగే కణాల ఉత్పరివర్తనానికి (ప్యాసింజర్ మ్యూటేషన్) క్యాన్సర్‌తో సంబంధం లేదురు. ఈ రెండు మ్యూటేషన్ల మధ్య గల తేడాలను కనుగొనడం సవాలుతో కూడుకున్నది. తాము అభివృద్ధి చేసిన నమూనాతో ‘డ్రైవర్ మ్యూటెషన్ల’ను సులభంగా కనుగొనవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలు ‘క్యాన్సర్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.