శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 08:19:42

న‌దిలో కొట్టుకుపోతున్న దంప‌తుల‌ను కాపాడారు.. వీడియో

న‌దిలో కొట్టుకుపోతున్న దంప‌తుల‌ను కాపాడారు.. వీడియో

ఇటాన‌గ‌ర్ : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. ఆ రాష్ర్టంలోని న‌దులు, వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద ఉధృతి నేప‌థ్యంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. ప‌సిఘాట్ ఏరియాలోని శిబో కోరంగ్ న‌ది ఉప్పొంగుతోంది. అయితే న‌దిలో ఇద్ద‌రు దంప‌తులు కొట్టుకుపోతున్న విష‌యాన్ని స్థానికులు గుర్తించారు. త‌క్ష‌ణ‌మే విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించ‌డంతో.. వారు అక్క‌డికి చేరుకున్నారు. స్థానికుల స‌హాయంతో విప‌త్తు అధికారులు.. తాళ్ల స‌హాయంతో దంప‌తుల‌ను ర‌క్షించారు. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన ఆ దంప‌తులిద్ద‌రూ విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ అధికారుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 

అరుణాచ‌ల్ లో ప‌లు చోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో.. మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. రాష్ర్ట వ్యాప్తంగా విప‌త్తు అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం ప్ర‌క‌టించారు. 


logo