గోస్వామికి బాలాకోట్ దాడి ముందే తెలుసా?!

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరిలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ సంగతి తనకు ముందే తెలుసునని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఉద్దేశ పూర్వకంగా బయటపెట్టారు. బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తాతో జరిగిన వాట్సాప్ చాటింగ్‌లో గోస్వామి వెల్లడించినట్లు తెలుస్తోంది. అర్నాబ్ గోస్వామికి, పార్థో దాస్ గుప్తాకు మధ్య జరిగిన చాట్‌లో సాధారణ దాడి కంటే పెద్ద దాడి... కొంత ప్రధానమైన చర్య ఉండొచ్చునని పరోక్షంగా గోస్వామి వెల్లడించారు. ఈ చాటింగ్ 2019 ఫిబ్రవరి 23వ తేదీన జరిగింది.
అంటే బాలాకోట్‌పై భారత వాయుసేన సారథ్యంలోని యుద్ధ విమానాలు సర్జికల్ స్ట్రయిక్స్ జరుగడానికి మూడు రోజుల ముందు ఈ చాటింగ్ జరుగడం గమనార్హం. సున్నితమైన సమాచారాన్ని వాట్సాప్ చాట్‌లో లీక్ చేయడం వెనుక అర్నాబ్ గోస్వామి ఉద్దేశాలను విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ లీకేజీపై అంతర్గతంగా విచారణ జరుపాలని విపక్ష పార్టీలు కేంద్రాన్ఇన డిమాండ్ చేస్తున్నాయి. అర్నాబ్ గోస్వామి అవివేకం, విచక్షణారాహిత్యంపై మిలిటరీ నిపుణులు సహా దేశమంతా మండిపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.