మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 08, 2020 , 17:15:42

రేటింగ్‌ స్కాంలో రిపబ్లిక్‌ టీవీ

రేటింగ్‌ స్కాంలో రిపబ్లిక్‌ టీవీ

ముంబై : టీఆర్పీ రేటింగ్స్‌ స్కామ్‌ గుట్టురట్టు చేసిన ముంబై పోలీసులు. ప్రముఖ చానెల్‌గా వెలుగొందుతున్న రిపబ్లిక్‌ టీవీ యాజమాన్యం రేటింగ్‌ స్కాంకు పాల్పడినట్లుగా ముంబై పోలీసులు ప్రకటించారు. రిపబ్లిక్‌ టీవీ రేటింగ్‌ స్కాంకు పాల్పడినట్లు పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. రిపబ్లిక్‌ టీవీ యాజమాన్యం, డైరెక్టర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరంవీర్‌ సింగ్‌ వెల్లడిస్తూ... రిపబ్లిక్‌ టీవీతో పాటు మరో రెండు చానెళ్లు రేటింగ్‌ స్కాంకు పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఒకే చానల్‌ను స్థిరంగా పెట్టి దాన్నే చూసేందుకు ఇంటికి రూ. 500 చొప్పున ఇస్తున్నారన్నారు. దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో రేటింగ్స్‌ స్కాం జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. రేటింగ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడే ఏ చానెల్‌ను వదిలిపెట్టమని పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.