గురువారం 04 జూన్ 2020
National - May 07, 2020 , 14:49:07

రెండోసారి గ్యాస్‌ లీక్‌ ప్రచారం అవాస్తవం

రెండోసారి గ్యాస్‌ లీక్‌ ప్రచారం అవాస్తవం

అమరావతి : ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో రెండోసారి గ్యాస్‌ లీకు అయిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ పోలీస్‌ విభాగం స్పష్టం చేసింది. మెయింటనెన్స్‌ టీం మరమ్మత్తు చర్యలు చేపట్టి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ఈ తెల్లవారుజామున గ్యాస్‌ లీకైన సంగతి తెలిసిందే. ఈ విష వాయువు కారణంగా ఇప్పటి వరకు 10 మంది మృత్యువాతపడ్డారు. వందల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల సహాయార్థం ప్రభుత్వం విస్తృత చర్యలను చేపట్టింది. ప్రమాద స్థలంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆ రాష్ట్ర డీజీపీ, పరిశ్రమలశాఖ మంత్రి తెలిపారు. గాలి నాణ్యత సైతం సాధారణ స్థితికి వచ్చినట్లుగా పేర్కొన్నారు.


logo