శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 23, 2020 , 02:26:10

గుజరాత్‌లో ఏం జరిగిందో గుర్తుచేసుకో!

గుజరాత్‌లో ఏం జరిగిందో గుర్తుచేసుకో!
  • వారిస్‌ పఠాన్‌కు బీజేపీ ఎమ్మెల్సీ గిరీశ్‌ వ్యాస్‌ హెచ్చరిక

నాగపూర్‌: గుజరాత్‌లో ఏం జరిగిందో గుర్తుచేసుకోవాలంటూ ఎంఐఎం నేత వారిస్‌ పఠాన్‌ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్సీ గిరీశ్‌ వ్యాస్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్ణాటకలోని కలబురిగిలో జరిగిన సీఏఏ వ్యతిరేక సభలో పఠాన్‌ మాట్లాడుతూ.. ‘గుర్త్తుంచుకోండి (మనం) 15 కోట్ల మందిమే అయినా, వంద కోట్ల మంది కంటే బలవంతులం’ అని అన్నారు. దీనిపై వ్యాస్‌ శుక్రవారం స్పందించారు. ‘మేమెంతో సహనంతో ఉన్నాం. అయితే దీనర్థం వారిని డీల్‌ చేయలేమని కాదు. గుజరాత్‌లోని కల్పూర్‌లో జరిగిన ఘటనలను గుర్తుచేసుకోండి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే అక్కడి ముస్లింలు మరోసారి సాహసించరని నేను భావిస్తున్నా’ అని గుజరాత్‌ అల్లర్ల గురించి పరోక్షంగా ప్రస్తావించారు.logo