శుక్రవారం 15 జనవరి 2021
National - Nov 25, 2020 , 15:49:37

అబోటాబాద్ గుర్తు లేదా.. పాక్‌కు ఇండియా స‌మాధానం

అబోటాబాద్ గుర్తు లేదా.. పాక్‌కు ఇండియా స‌మాధానం

యునైటెడ్ నేష‌న్స్‌:  పాకిస్థాన్‌కు మ‌రోసారి గ‌ట్టి స‌మాధానం ఇచ్చింది ఇండియా. ఐక్య రాజ్య స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర‌స్‌కు పాక్ అబ‌ద్ధాల నివేదిక‌ను ఇచ్చింద‌ని యూఎన్‌లో భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు. ఐక్య రాజ్య‌స‌మితి నిషేధానికి గురైన ఉగ్ర‌వాదులు, సంస్థ‌ల‌కు పాకిస్థాన్ అడ్డా అని, అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హ‌త‌మైన అబోటాబాద్ గుర్తు లేదా అని ఆయ‌న ట్వీట్ చేశారు. పాకిస్థాన్ ఇచ్చిన ఈ అబ‌ద్ధాల నివేదిక‌కు అస‌లు ఏమాత్రం విశ్వ‌స‌నీయ‌త లేద‌ని ఆయ‌న అన్నారు. ఇలాంటి త‌ప్పుడు  ఆరోప‌ణ‌లు, బూట‌క‌పు నివేదిక‌లు పాకిస్థాన్‌కు కొత్త కాద‌ని తిరుమూర్తి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పాక్ రాయ‌బారి మునీర్ అక్ర‌మ్‌.. ఐక్య‌రాజ్య స‌మితి ఆంటోనియో గుటెర‌స్‌ను క‌లిసి.. ఇండియా ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని ఫిర్యాదు చేశారు. దీనికి ప్ర‌తిగా తిరుమూర్తి ట్విట‌ర్‌లో ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్‌లో ఉన్న నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ్మ‌ద్‌కు చెందిన ఉగ్ర‌వాదులు ఇండియాలో దాడికి ప్ర‌య‌త్నించార‌ని, న‌గ్రోటాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో వాళ్లు మృత్య‌వాత ప‌డ్డార‌న్న విష‌యాన్ని విదేశాంగ కార్య‌ద‌ర్శి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌.. స‌భ్య దేశాల‌కు వివ‌రించారు.