సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 23:45:57

ధనియాలతో తలనొప్పి మాయం... ఎలాగంటే...?

 ధనియాలతో తలనొప్పి మాయం... ఎలాగంటే...?

హైదరాబాద్: ధనియాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో మన శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలు ఉన్నాయి. కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే ఇట్టే తగ్గిపోతుంది. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయం చేసుకొని ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు, స్త్రీలకు కూడా ఎక్కువగా మేలు చేస్తుంది. గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.

ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకొని చిన్నచిన్న గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. అజీర్తి, పుల్లత్రేపులు, కడుపుబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి కొద్దిగా ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడి వాడుతుంటే నివారణ కల్గుతుంది. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం మటుమాయమవుతుంది.


logo