శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 23, 2020 , 10:27:43

రెమ్డిసివిర్‌, టోసిలిజుమాబ్ ఔష‌ధాల‌ను అతిగా సూచిస్తున్నారు..

రెమ్డిసివిర్‌, టోసిలిజుమాబ్ ఔష‌ధాల‌ను అతిగా సూచిస్తున్నారు..

హైద‌రాబాద్‌: అవ‌స‌రం లేని కోవిడ్ పేషెంట్ల‌కు కూడా రెమ్డిసివిర్, టోసిలిజుమాబ్ ఔష‌ధాల‌ను సూచిస్తున్నార‌ని భార‌తీయ ఫార్మ‌సీ శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ‌కు.. ఫార్మ‌సీ డిపార్ట్‌మెంట్ లేఖ రాసింది. యాంటీ వైర‌ల్ ఔష‌ధాలు రెమ్డిసివిర్, టోసిలిజుమాబ్ ల‌ను అతిగా సూచించ‌డం వ‌ల్లే.. మార్కెట్లో ఆ ఔష‌ధాల‌ను అధిక ధ‌ర‌ల‌కు అమ్మ‌తున్న‌ట్లు ఫార్మ‌సీ శాఖ వెల్ల‌డించింది. ఈ రెండు ఔష‌ధాల అతి వినియోగాన్ని త‌గ్గించాల‌ని ఆ శాఖ డిమాండ్ చేసింది.  డాక్ట‌ర్ల‌కు  కూడా ఈ ఔష‌ధాల వినియోగం గురించి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఫార్మ‌సీ శాఖ‌.. కేంద్ర ఆరోగ్య శాఖ‌ను కోరింది. ఎలాంటి ప‌రిస్థితుల్లో రెండు ఔష‌ధాల‌ను వాడాల‌న్న సూచ‌న చేయాల‌ని పేర్కొన్న‌ది. 

తీవ్ర కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు మాత్ర‌మే రెమ్డిసివిర్ వాడ‌వ‌చ్చు అని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఆ ఆమోదం తెలిపింది.  ప్ర‌స్తుతం భార‌త్‌లో ఈ ఔష‌ధాన్ని త‌యారు చేయ‌డం లేదు. దేశానికి చెందిన హెటిరో, జుబిలాంట్ లైఫ్ సైన్సెస్‌, సిప్లా, మిలాన్ ఎన్‌వీ ఫార్మ కంపెనీలు.. గిలాడ్ సైన్సెస్ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.  అయితే డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా నుంచి రెమ్డిసివిర్ ఉత్ప‌త్తి కోసం అనుమ‌తి రావాల్సి ఉన్న‌ది. 


logo