బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 21:32:08

టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు ఊరట

టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు ఊరట

ఢిల్లీ : టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు పెద్ద ఉపశమనం క‌లిగించేలా  ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) తీర్పును వెల్ల‌డించింది. కమిషనర్ ఆదాయపు పన్ను (సీఐటీ) అప్పీల్‌కు వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌పై ట్రస్ట్‌కు అనుకూలంగా జస్టిస్ పీపీ భట్‌   ధర్మాసనం జులై 24న తన‌ తీర్పును వెలువ‌రించింది. టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు దాదాపు రూ.220 కోట్లకు పైగా ఆదాయ‌పు పన్నును సీఐటీ విధించింది. తాజాగా స‌ద‌రు డిమాండ్‌కు ఎలాంటి కనీస చెల్లింపు చేయాల్సిన అవ‌స‌రం లేకుండానే ఐటీఏటీ ప‌న్ను డిమాండ్‌ను నిలిపివేసింది.

స్థూల స్థాయిలో ఇటువంటి ముందుచూపు క‌లిగిన విధానాలను అనుసరించి క్షేత్ర‌స్థాయిలో ఇలాంటి ప్ర‌త్యేక వివక్త పరిస్థితులను మూసివేయ‌డం స‌బ‌బు కాదు. సంబంధిత అధికారుల‌ను ఇలాంటి విష‌యాల‌పై త‌గిన అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా ఇలాంటి సంఘ‌ట‌న‌లు కనిష్ఠీక‌రించాలి అని ఐటీఏటీ అభిప్రాయ‌ప‌డింది. "పన్ను పరిపాలన వ్య‌వ‌స్థ‌లోని ప్రతిస్థాయిలో న్యాయమైన విధానాన్ని అవలంబించడం ద్వారా పన్ను చెల్లింపుదారుల‌కు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయాల్సిన‌ అవ‌స‌రం ఎంతైనా ఉంది" అని ఐటీఏటీ అభిప్రాయ‌ప‌డింది.


logo