బుధవారం 27 మే 2020
National - May 13, 2020 , 18:59:08

కాంట్రాక్టర్లకు ఊరట.. 6 నెలల గడువు పొడిగింపు

కాంట్రాక్టర్లకు ఊరట.. 6 నెలల గడువు పొడిగింపు

ఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో తలెత్తిన సంక్షోభం కారణంగా కాంట్రాక్టర్లకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం నేడు ప్రకటించింది. నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాల గడువు కాంట్రాక్టులన్నీంటిని 6 నెలలు పొడిగింస్తూ నిర్ణయం వెలువరించింది. పీపీపీ నిర్మాణాలకు కూడా ఈ పెంపు గడువు వర్తించనున్నట్లు పేర్కొంది. అదేవిధంగా రెరా పరిధిలోకి వచ్చే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు ఊరట కల్పించింది. రెరా నిబంధనల ప్రకారం భవన నిర్మాణాల పూర్తికి గడువును మరో 6 నెలలు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ఒప్పంద పనుల పూర్తికి సైతం 6 నెలల అదనపు సమయాన్ని ఇచ్చింది. నిర్మాణ, సేవల ఒప్పందాలకు సంబంధించి 6 నెలల వెసులుబాటు కల్పించింది. కేంద్ర ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేసింది. పూర్తైన పనుల ఆధారంగా బ్యాంకు గ్యారంటీలు పాక్షికంగా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ తెలిపింది. ఈ వెసులుబాట్లతో కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత కొరత తగ్గుతుందని పేర్కొంది.


logo