బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 16:40:25

పండ్లు, కూర‌గాయ‌ల రైతుల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ...

పండ్లు, కూర‌గాయ‌ల రైతుల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ...

బెంగ‌ళూరు: ఉద్యాన‌వ‌న పంట‌లైన పండ్లు, కూర‌గాయ‌ల రైతుల కోసం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి బి.సి పాటిల్ ప్ర‌క‌టించారు. కోవిడ్ 19, లాక్‌డౌన్ కార‌ణంగా ఎగుమ‌తులు లేక పండ్ల రైతులు, కూర‌గాయ‌ల రైతులు పూర్తిగా న‌ష్ట‌పోయార‌ని పేర్కొన్నారు.  మొద‌టి విడ‌త‌గా తీవ్రంగా న‌ష్ట‌పోయిన వారికోసం ప్ర‌భుత్వం 1,610 కోట్లు విడుద‌ల చేసింద‌ని తెలిపారు. ఇందులో పూల తోట‌లు సాగు చేస్తున్న రైతుల‌కు హెక్టారుకు రూ.25 వేలు ఇస్తున్నాం. మంగ‌లి షాప్‌ల‌కు, దోబీకి, ఆటో రిక్షా, టాక్సీ డ్రైవ‌ర్‌కు రూ. 5వేలు ప‌రిహారం ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. 30జిల్లాల్లో తాను ప‌ర్య‌టించి రైతుల‌తో మాట్లాడాన‌ని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పండ్ల తోట‌లు, కూర‌గాయ‌ల రైతుల‌కు కూడా ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించాల‌ని సీఎం య‌డ్యుర‌ప్ప‌కు విజ్ఞ‌ప్తి చేశాన‌ని తెలిపారు. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని తెలిపారు. 


logo