శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 12:30:00

హైకోర్టులో స‌చిన్ పైల‌ట్‌కు ఊర‌ట‌.. గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు సీఎం గెహ్లాట్‌

హైకోర్టులో స‌చిన్ పైల‌ట్‌కు ఊర‌ట‌.. గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు సీఎం గెహ్లాట్‌

హైద‌రాబాద్‌:  రాజ‌స్థాన్ మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌తో పాటు 19 మంది రెబెల్ ఎమ్మెల్యేల‌కు ఊర‌ట ల‌భించింది. వారిపై ఎటువంటి చ‌ర్య తీసుకోరాదు అని రాజ‌స్థాన్ హైకోర్టు చెప్పింది.  సీఎం గెహ్లాట్ ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌చిన్ పైల‌ట్ బృందంపై ఆ రాష్ట్ర స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వేశారు. దాన్ని స‌వాల్ చేస్తూ పైల‌ట్ టీమ్ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఇవాళ రాజ‌స్థాన్ హైకోర్టు ఆ అంశంలో తీర్పు ఇస్తూ.. స్టే విధించింది. అయితే ఇదే కేసును సోమ‌వారం సుప్రీంకోర్టు విచారించే అవ‌కాశాలు ఉన్నాయి.  

హైకోర్టు తీర్పు ఇవ్వ‌కుండా అడ్డుకోవాల‌ని స్పీక‌ర్ జోషి సుప్రీంను ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. అయితే అస‌మ్మ‌తి గ‌ళాల్ని అణిచివేయ‌లేమ‌ని ఆ కేసులో గురువారం సుప్రీం తీర్పునిచ్చింది.  స‌చిన్ పైల‌ట్‌కు ఊర‌ట ల‌భించ‌డంతో.. సీఎం అశోక్ గెహ్లాట్ త‌న ఎమ్మెల్యేల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌నున్నారు.  ఆయ‌న అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష కోర‌నున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని, ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లు అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.


తాజావార్తలు


logo