గురువారం 26 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 01:16:19

మధ్యాహ్న భోజన పథకంలో బలవర్ధక బియ్యం: కేంద్రం

మధ్యాహ్న భోజన పథకంలో బలవర్ధక బియ్యం: కేంద్రం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 23: పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు బడుల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద బలవర్ధకమైన(ఫోర్టిఫైడ్‌) బియ్యాన్ని అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. ఈ బియ్యంలో విటమిన్‌ బీ12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయని చెప్పారు. శుక్రవారం ఓ వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు సూక్ష్మపోషకా లు అత్యంత కీలకమని, దేశవ్యాప్తంగా అన్ని ఐసీడీఎస్‌ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం అమలయ్యే పాఠశాలల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అందించనున్నామని వెల్లడించారు.