గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 02:06:15

న్యూస్‌ఛానళ్లను నియంత్రించాలి

న్యూస్‌ఛానళ్లను నియంత్రించాలి

  • ఎన్‌బీఏను బలోపేతం చేయాలి: సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ మీడియాలో స్వీయ నియంత్రణ వ్యవస్థ సరిగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సభ్యత్వం కలిగిన, సభ్యత్వం లేని చానళ్లనూ ఒకేవిధంగా నియంత్రించేలా నేషనల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ అసోసియేషన్‌ను (ఎన్‌బీఏ)ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. ఇందుకు సూచనలు అందించాల్సిందిగా కేంద్రాన్ని, ఎన్‌బీఏను శుక్రవారం ఆదేశించింది. ముస్లింలు సివిల్‌ సర్వీసుల్లోకి ప్రవేశించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ సుదర్శన్‌ టీవీ రూపొందించిన బిందాస్‌ బోల్‌ కార్యక్రయాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారిస్తూ పైవిధంగా స్పందించింది. 


logo