శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 09:14:40

మార్చి 25 నుంచి వారి బ్యాంకు ఖాతాల్లోకి రీఫండ్​ సొమ్ము

మార్చి 25 నుంచి వారి బ్యాంకు ఖాతాల్లోకి రీఫండ్​ సొమ్ము

తిరుమల : కరోనా వైరస్​ వ్యాప్తిని నివారించడంలో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానికుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తిరుమల - తిరుపతి మధ్య కనుమ రహదారుల్లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. ముందస్తుగా ఆన్​లైన్​లో బుక్​ చేసుకున్న రూ.300 దర్శన టోకెన్లు, ఆర్జిత సేవలు, గదులను భక్తులు రద్దు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మార్చి 25 నుంచి వారి బ్యాంకు ఖాతాల్లోకి రీఫండ్​ సొమ్ము చెల్లిస్తామని వెల్లడించారు.

నేడు కోయిల్​ ఆళ్వార్​ తిరుమంజనం, రేపు ఉగాది ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలోకి సిబ్బందిని పరిమితంగా అనుమతించాలని సూచించారు.శ్రీశార్వరి నామ ఉగాది సందర్భంగా బుధవారం తిరుమలలో ఉగాది ఆస్థానాన్ని తితిదే నిర్వహించనుంది. ఉదయం వేకువజామున 3 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ తర్వాత 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి వేశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. మూల విరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది పంచాంగాన్ని పఠించనున్నారు.


logo