సోమవారం 01 జూన్ 2020
National - May 18, 2020 , 00:25:31

పదో వంతుకు తగ్గిన టెస్టింగ్‌ స్వాబ్స్‌ ధర

పదో వంతుకు తగ్గిన టెస్టింగ్‌ స్వాబ్స్‌ ధర

  • పది రోజుల్లోనే భారత్‌ విజయం

న్యూఢిల్లీ: కరోనా అనుమానితుల ముక్కు, నోటి నుంచి నమూనాల్ని సేకరించేందుకు ఉపయోగించే టెస్టింగ్‌ స్వాబ్స్‌ ధరల్ని పదో వంతుకు తీసుకురావడంలో భారత్‌ విజయం సాధించింది. చైనా స్వాబ్స్‌ నాణ్యతలో లోపాలు, ధర రూ.17గా ఉండటం కేంద్రానికి తలకుమించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ‘మేకిన్‌ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా వీటిని సంయుక్తంగా తయారు చేసినట్టు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థలు వెల్లడించాయి. ఒక్కో స్వాబ్‌ ధర రూ. 1.7గా నిర్ణయించామని, దీన్ని రూపాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నాయి.  logo