ఆదివారం 05 జూలై 2020
National - Jun 27, 2020 , 18:47:20

చండీఘర్‌లో తగ్గిన కరోనా కేసులు..

చండీఘర్‌లో తగ్గిన కరోనా కేసులు..

చండీఘర్‌ : చండీఘర్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు అక్కడ కేవలం మూడు పాజిటీవ్‌ కేసులు మాత్రమే నిర్ధారణ అయినట్లు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నేటి ౩ కేసులతో కలిపి మొత్తం అక్కడ 427 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. అందులో 86 మంది మాత్రమే చికిత్స పొందుతుండగా.. 335 మంది డిశ్జార్జి అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. 

అయితే కేంద్ర వైద్య శాఖ మంత్రి లెక్కల ప్రకారం శనివారం భారత్‌లో కరోనా కేసులు 5 లక్షల మార్క్‌ను దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తంలో 18,552 రికార్డు కేసులు నమోదయ్యాయి. 1,97,387 మంది చికిత్స పొందుతుండగా.. 2,95,880 మంది డిశ్చార్జి అయ్యారు. 15,685 మంది కరోనాతో మరణించినట్లు నేడు ఉదయం కేంద్రం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.


logo