శుక్రవారం 10 జూలై 2020
National - Jun 23, 2020 , 21:59:55

పాక్‌ హైకమిషన్‌లో 50శాతం సిబ్బందిని తగ్గించాలి : భారత్‌

పాక్‌ హైకమిషన్‌లో 50శాతం సిబ్బందిని తగ్గించాలి : భారత్‌

న్యూఢిల్లీ : ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిని 50 శాతానికి తగ్గించాలని భారత్‌ పాక్‌ను ఆదేశించింది. ఢిల్లీలో పాక్‌ అధికారుల గూఢచర్యం, తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలు, ఇస్లాబాద్‌లోని భారత హైకమిషన్‌ అధికారులతో వ్యవహరించిన తీరును నిరసిస్తూ సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకు వారం రోజులు గడువు ఇచ్చింది. అలాగే ఇస్లామాబాద్‌లో పని చేస్తున్న 50శాతం సిబ్బందిని కూడా వెనక్కి రప్పిస్తామని తెలిపింది.  పాకిస్తాన్‌ చర్యలు వియ‌న్నా ఒప్పందం, ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన ద్వైపాక్షిక‌ ఒప్పందాల‌కు విరుద్ధంగా ఉంద‌ని ఛార్జ్ డి అఫైర్స్‌కు తెలిపింది. పాక్ చర్యలు, ఉగ్రవాదం హింస‌కు ప్రోత్సాహం ఇస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. గూఢచర్యం కార్యకలాపాల కోసం ఒక వ్యక్తిని నియమిస్తూ ఇద్దరు పాకిస్తాన్ హై కమిషన్ అధికారులను మే 31న పట్టుబడిన అంశాన్ని, అలాగే జూన్ 15న ఇస్లామాబాద్ లో ఇద్దరు భారత హై కమిషన్ సిబ్బందిని అరెస్టు చేసి అనారోగ్యానికి గురి చేసిన విషయాలను ప్రస్తావించింది. ఈ క్రమంలో రెండు దేశాల్లోని హై కమిషన్‌ కార్యాలయాల్లో 50శాతం సిబ్బందిని తగ్గించాల్సిందేనని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.


logo