గురువారం 09 జూలై 2020
National - Jun 26, 2020 , 19:07:51

రెండు చిరుత చర్మాలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

రెండు చిరుత చర్మాలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

హైదరాబాద్‌ : చిరుతపులి చర్మాలను రెండింటిని పోలీసులు నేడు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృంద సభ్యులు, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంపావత్‌లో చిరుతపులి చర్మాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు లోహాఘాట్‌ నుంచి చంపావత్‌కు వీటిని తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చంపావత్‌ ఎస్పీ తెలిపారు.logo