ఆదివారం 05 జూలై 2020
National - Jun 20, 2020 , 00:56:27

రికార్డు స్థాయిలో 13,586 కేసులు

రికార్డు స్థాయిలో 13,586 కేసులు

న్యూఢిల్లీ, జూన్‌ 19: దేశంలో రోజువారీగా కరోనా కేసుల నమోదు రికార్డులు సృష్టిస్తున్నది. వరుసగా 8వ రోజు కూడా 10,000లకుపైగా కేసులు నమోదయ్యాయి. గురువారం నుంచి శుక్రవారం నాటికి 24 గంటల్లో రికార్డుస్థాయిలో 13,586 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3,80,532కు పెరిగింది. ఇప్పటి వరకు 2,04,710 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 53.79గా నమోదైంది. వైరస్‌ బారిన పడిన వారిలో తాజాగా 336 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12,573కు చేరింది. 


logo