బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 10:18:34

ఒకేరోజు 67 వేల పాజిటివ్ కేసులు

ఒకేరోజు 67 వేల పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: ‌దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతున్న‌ది. గ‌త రెండు రోజులు పాజిటివ్ కేసుల తీవ్ర‌త కొంత త‌గ్గిన‌ప్ప‌టికీ మ‌రోమారు మ‌హ‌మ్మారి త‌న పంజా విసిరింది. నిన్న 60 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, నేడు రికార్డు స్థాయిలో 67 వేల మంది క‌రోనాబారిన ప‌డ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో ఉన్న‌ది.

గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 66,999 పాజిటివ్‌ కేసులు న‌మోద‌వ‌గా, 942 మంది బాధితులు మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 23,96,638 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఇందులో 16,95,982 మంది బాధితులు కోలుకోగా, మ‌రో 6,53,622 కేసులు యాక్టివ్‌గా ఉన్న‌యి. అదేవిధంగా క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 47,033 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ్య‌ శాఖ ప్ర‌క‌టించింది.         

దేశంలో ప్ర‌తిరోజు భారీసంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ, కోలుకుంటున్న ‌వారిసంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతున్న‌ది. దీంతో రిక‌వ‌రీ రేటు 70 శాతానికి చేరుకోగా, మ‌ర‌ణా‌ల రేటు 1.98 శాతంగా ఉంది.

దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 12 వ‌ర‌కు 2,68,45,688 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, నిన్న ఒక్క‌రోజే 8,30,391 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నామండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌రోజులో ఇంత భారీ సంఖ్య‌లో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి. 

తాజావార్తలు


logo