సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 07:59:57

భారత్‌ నిధులతో బంగ్లాదేశ్‌లో ఆలయ పునఃనిర్మాణం

భారత్‌ నిధులతో బంగ్లాదేశ్‌లో ఆలయ పునఃనిర్మాణం

ఢాకా : బంగ్లాదేశ్‌లోని 300 ఏండ్ల కిందటి పురాతన ఆలయ పునఃనిర్మాణాన్ని భారత్‌ ప్రారంభించింది. నాతోర్‌ జిల్లాలోని శ్రీశ్రీ జాయ్‌కాళి మాతర్‌ ఆలయాన్ని 18వ శతాబ్దం ప్రారంభంలో దయారామ్‌ రాయ్‌ నిర్మించారు. ఆయనను దిఘపతి రాజ కుటుంబం వ్యవస్థాపకుడిగా చరిత్రకారులు పేర్కొంటుంటారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ ప్రారంభోత్స కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ సమాచార శాఖ మంత్రి జునైద్‌ అహ్మద్‌ పలాక్‌, బంగ్లాదేశ్‌లోని ఇండియన్‌ హై కమిషనర్‌ రీవా గంగూలీ దాస్‌, నాతోర్‌ మేయర్‌ ఉమా చౌదరి పాల్గొన్నారు. కాగా భారత్‌ అందజేసే నిధులతో ఈ ఆలయ నిర్మాణం పూర్తి కానుంది.logo