మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 08:19:25

‘హనుమాన్‌ చాలీసా పఠించండి.. కరోనాను తరిమేయండి..’

‘హనుమాన్‌ చాలీసా పఠించండి.. కరోనాను తరిమేయండి..’

భోపాల్‌ : కరోనా వైరస్‌ మహమ్మారిని తరిమేందుకు ప్రతి ఒక్కరూ రోజుకు ఐదుసార్లు హనుమాన్‌ చాలీసా పఠించాలని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ పిలుపునిచ్చారు. మంచి ఆరోగ్యం కోసం, కరోనా నుంచి విముక్తి పొందేందుకు అందరం కలిసి ఆధ్యాత్మికం వైపు పయనిద్దామని ప్రగ్యా ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు. జులై 25వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు ప్రతి ఒక్కరూ మీ ఇంట్లోనే ఐదుసార్లు హనుమాన్‌ చాలీసాను పఠించాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించే ఆగస్టు 5వ తేదీన అందరూ ఇండ్లలోనే దీపాలు వెలిగించి.. రాముడికి హారతి ఇవ్వాలన్నారు. ఆ రోజుతో హనుమాన్‌ చాలీసా పఠన కార్యక్రమాన్ని ముగిద్దామని పేర్కొన్నారు. 

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రగ్యా ఠాకూర్‌ స్పష్టం చేశారు. భోపాల్‌లో ఆగస్టు 4వ తేదీన లాక్‌డౌన్‌ ముగుస్తుంది. ఆగస్టు 5న హనుమాన్‌ చాలీసా పఠన కార్యక్రమం పూర్తవుతుంది. అదే రోజు రామాలయం నిర్మాణానికి భూమి పూజ కూడా. దీంతో ఆరోజున దీపావళి పండుగ మాదిరి సెలబ్రేషన్స్‌ చేసుకుందామని బీజేపీ ఎంపీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

దేశ వ్యాప్తంగా ఉన్న హిందూవులందరూ ఒకే గొంతుతో హనుమాన్‌ చాలీసా పఠిస్తే కరోనా నుంచి విముక్తి పొందుతాం. అది కచ్చితంగా పని చేస్తుంది అని ప్రగ్యా ఠాకూర్‌ చెప్పారు. 

తాజావార్తలు


logo