శుక్రవారం 10 జూలై 2020
National - Jun 25, 2020 , 13:09:23

ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంవైపే ఉన్నారు: మ‌ణిపూర్ సీఎం

ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంవైపే ఉన్నారు: మ‌ణిపూర్ సీఎం

న్యూఢిల్లీ: మ‌ణిపూర్‌లో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతున్న‌ది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారుకు నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) మ‌ద్ద‌తు ఉప‌సంహర‌ణ‌, ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌ణిపూర్ స‌ర్కారు మైనారిటీలో ప‌డింది. దీంతో బీరేన్ సింగ్ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టి ప్ర‌భుత్వాన్ని కూల్చాల‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ భావిస్తున్న‌ది. ఈ మేర‌కు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టుకు ఆదేశించాల‌ని కాంగ్రెస్ పార్టీ గ‌వ‌ర్న‌ర్‌ను కోరింది.

 కాగా, మ‌ణిపూర్‌లో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బీరేన్‌సింగ్ స్పందించారు. రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ‌వైపే ఉన్నార‌ని, త‌మ ప్రభుత్వానికి వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌ల విశ్వాసం ఉన్న‌న్ని రోజులు తాము ఎలాంటి సంక‌ట స్థితిని అయినా ఎదుర్కోగ‌ల‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాల్లో ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు సాధార‌ణ‌మేన‌ని, అయితే నిజానిజాల‌ను ప్ర‌జ‌లు గ్ర‌హిస్తార‌ని సీఎం బీరేన్‌సింగ్ చెప్పారు.  


logo