శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 01:46:57

మహిళలను గౌరవిద్దాం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌

మహిళలను గౌరవిద్దాం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రత, గౌరవానికి పునరంకితమవుదామని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ పిలుపునిచ్చారు. తద్వారా వారు తమ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కోరుకున్న మార్గంలో నడిచేందుకు వీలవుతుందని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ  రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు. మెరుగైన సమాజం, దేశం, ప్రపంచ నిర్మాణానికి వారు చేస్తున్న అలుపెరుగని కృషికి అతివలందరినీ గౌరవించుకునే సందర్భం ఇదని చెప్పారు. అలాగే మహిళల అసాధారణ శక్తి సామర్థ్యాలను, ప్రతిభా పాటవాలను  గుర్తించే సమయం ఇదని పేర్కొన్నారు. 


logo