శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 22:45:48

రూ.200 కోట్లు దాటిన ఆర్‌సిఎఫ్ అమ్మకాలు

రూ.200 కోట్లు దాటిన ఆర్‌సిఎఫ్ అమ్మకాలు

ఢిల్లీ : కరోనా సవాళ్లు ఉన్నప్పటికీ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సిఎఫ్)తన కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 లో 2020 జూలై 27 వరకు దాని పారిశ్రామిక ఉత్పత్తుల అమ్మకాలలో రూ.200 కోట్లు దాటింది. సంస్థ ప్రకటన ప్రకారం 67 రోజుల్లో రూ. 100 కోట్లను సాధిస్తే, తర్వాతి 51 రోజుల్లోనే రూ. 100 కోట్ల అమ్మకాలను సాధించినట్టు వెల్లడించింది. ఆర్‌సిఎఫ్ పరిశ్రమిక ఉత్పత్తుల విభాగం (ఐపిడి) తన వ్యాపార సముచ్ఛయంలో ఉన్న 23 ఉత్పత్తులు- ఇతర పరిశ్రమలైన ఫార్మస్యూటికల్స్, క్రిమిసంహారక మందులు, గనులు, బేకరీ, ఫైబర్లు, తోలు మొదలైన పరిశ్రమల్లో ప్రధాన అవసరాలుగా ఉన్నాయి.

సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో దేశ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు మరింత వృద్ధి సాధించడానికి బలమైన చోదక శక్తిగా ఆర్‌సిఎఫ్ నిలిచింది. ఆహార భద్రత కు ఈ సంస్థ ఇతోధిక సాయం చేసింది. రైతులకు నిరంతరంగా ఎరువులను అందించింది. సరఫరా గొలుసు వ్యవస్థలో ఈ మహమ్మారి సమయంలో అనేక అడ్డంకులు ఎదురైనప్పటికి ఆర్‌సిఎఫ్ 2020-21 మొదటి త్రైమాసికంలో 5.9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను విజయవంతంగా ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పటికే  జులై లో 2.3 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది. దేశంలో కొరతను తీర్చడానికి ఆర్‌సిఎఫ్ వివిధ గ్రేడ్లకు చెందిన 2ఎమ్‌టి కంటే ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులను దిగుమతి చేసుకుంది.

స్టేట్ ట్రేడింగ్ ఎంటర్‌ప్రైజ్‌గా, ఎరువుల శాఖ తరపున కంపెనీ 13 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంది. సామాజిక బాధ్యత కలిగిన కార్పొరేట్‌గా ఇది కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి బహుళ మార్గాల ద్వారా దోహదపడింది. ఆర్‌సిఎఫ్ ఉద్యోగులు పిఎమ్ కేర్స్ ఫండ్, సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించి సహకరించారు. కంపెనీ తన హాస్టల్ ప్రాంగణాన్ని కోవిడ్ కేర్ సెంటర్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఇది ఇతర సహాయక కార్యకలాపాలతో పాటు అలీబాగ్‌లోని కలెక్టర్ కార్యాలయానికి అంబులెన్స్‌ను కూడా అందించింది. ఈ కాలంలో, ఆర్‌సిఎఫ్ అధికారులు జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను అనుసరించింది. ఎరువులు, పారిశ్రామిక ఉత్పత్తుల నిరంతరాయ ఉత్పత్తిని తన అందించేలా ఉద్యోగులందరి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ ఎరువుల శాఖ మద్దతు, మార్గదర్శకత్వంతో ముందుకు సాగుతున్నది. 


logo