గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 14:57:34

ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిర‌క్ష‌ణ‌కే ఆర్బీఐ చ‌ర్య‌లు: ప‌్ర‌ధాని మోదీ

ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిర‌క్ష‌ణ‌కే ఆర్బీఐ చ‌ర్య‌లు: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: క‌రోనా ర‌క్క‌సి విస్త‌ర‌ణ నేప‌థ్యంలో కేంద్రం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ఇబ్బందులను త‌గ్గించేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రుణ చెల్లింపుల‌పై మూడు నెల‌ల మార‌టోరియం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఆర్బీఐ ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌ధాని మోదీ స్వాగ‌తించారు.

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం నుంచి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌రిర‌క్షించ‌డానికే ఆర్బీఐ భారీ చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని ప్ర‌ధాని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆర్బీఐ తాజా ప్ర‌క‌ట‌నతో ద్ర‌వ్య ల‌భ్య‌త పెరుగ‌డ‌మేగాక‌, నిధులపై వ్య‌యం త‌గ్గుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. దీనివ‌ల్ల మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు, వ్యాపార వ‌ర్గాల‌కు ఊతం ల‌భిస్తుంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. 


logo