బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 25, 2020 , 19:40:54

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ ‌కు కరోనా...

 ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ ‌కు కరోనా...

ఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కు కరోనా సోకింది. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చినట్లు ఆయనే స్వయంగా ఆదివారం ట్వీట్‌ చేశారు. తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి అంతా ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు. తనను ఇటీవల కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని శక్తికాంత దాస్‌ సూచించారు. స్వీయ నిర్బంధంలో ఉంటూనే తన కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఆర్‌బీఐ యథావిధిగా పనిచేస్తుందని చెప్పారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌, టెలిఫోన్ల ద్వారా అందుబాటులో ఉంటానని" శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.