శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 13:16:55

మారటోరియం గడువు పెరగనున్నదా ?

మారటోరియం గడువు పెరగనున్నదా ?

ఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఈర్బీఐ) ఇప్పటి వరకు ఆరు నెలల పాటు అన్ని రకాల రుణాల చెల్లింపులపై మారటోరియాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గడువు కాలంలోనూ ఆర్ధిక వృద్ధి కనిపించక పోవడంతో మరోసారి మారటోరియం గడువును పొడిగించే యోచనలో ఆర్బీఐ ఉన్నదని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆగస్టు 31తో ముగియనున్న మారటోరియాన్ని మరికొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో ఆర్బీఐ ఉన్నట్టు వారు అంటున్నారు. ఈ అంశం పై ఆర్బీ ఐ అధికారులు  చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తున్నది. అన్ని రంగాలకూ కాకుండా, ఇప్పటికీ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న విమానయాన రంగం, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, టూరిజం తదితర రంగాలకు మినహాయింపులు ఇచ్చే ఉన్నదని సమాచారం.


logo