మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 17:35:00

రావణాసురుడికి కరోనా పాజిటివ్‌..!వీడియో వైరల్‌

రావణాసురుడికి కరోనా పాజిటివ్‌..!వీడియో వైరల్‌

చండీగఢ్‌: రావణాసురుడికి కరోనా పాజిటివ్‌ రావడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా..! హర్యానాలో ఓ అంబులెన్స్‌పై రావణుడి దిష్టిబొమ్మను కట్టుకొని తీసుకెళ్లారు. దీన్ని మరో వాహనంలోనుంచి వీడియో తీసిన ఒకరు ఫన్నీగా ‘రావణాసురుడికి కరోనా పాజిటివ్‌.. దవాఖానకు తీసుకెళ్తున్నారు’అని క్యాప్షన్‌తో సోషల్‌మీడియాలో పెట్టారు. దీంతో అది వైరల్‌గా మారింది. 

ఈ వీడియోను ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శర్మ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. రావణుడి దిష్టిబొమ్మను తీసుకెళ్తున్న అంబులెన్స్‌ డాక్టర్ సేథి అమర్ హాస్పిటల్, ఖార్ఖోడా, సోనిపట్ జిల్లాకు చెందింది. కాగా, ఈ వీడియో ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వైరల్‌ అవుతోంది. ట్విట్టర్‌లో ఈ వీడియోను 10,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. 

 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.