మంగళవారం 26 జనవరి 2021
National - Nov 26, 2020 , 13:49:22

తాజ్ హోట‌ల్‌పై దాడి.. ర‌త‌న్ టాటా భావోద్వేగం

తాజ్ హోట‌ల్‌పై దాడి.. ర‌త‌న్ టాటా భావోద్వేగం

హైద‌రాబాద్‌:  2008, న‌వంబ‌ర్ 26వ తేదీన ముంబైలో ఉగ్ర‌వాదులు దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ మార‌ణ‌హోమానికి నేటితో 12 ఏళ్లు నిండాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ర‌త‌న్ టాటా ఆ దుర్ఘ‌ట‌న‌పై స్పందించారు. ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న కొన్ని కామెంట్స్ చేశారు.  తాజ్‌మ‌హ‌ల్ ప్యాలెస్ హోట‌ల్ ఫోటోను పోస్టు చేసి.. ఆ విధ్వంసాన్ని మ‌రిచిపోలేమ‌ని అన్నారు. వందేళ్ల క్రితం నాటి తాజ్‌మ‌హ‌ల్ హోట‌ల్‌పై 12 ఏళ్ల క్రితం ఉగ్ర‌వాదులు దాడి చేశారు.  ఆ తాజ్ హోట‌ల్ ఓన‌ర్ టాటా గ్రూపే. అయితే ఉగ్ర‌వాదాన్ని ఓడించేందుకు ముంబై ప్ర‌జ‌లు చూపిన తెగువ‌ను, సాహ‌సాన్ని ర‌త‌న్ టాటా మెచ్చుకున్నారు. ముంబై ప్ర‌జ‌లు ఆ రోజు ప్ర‌ద‌ర్శించిన సున్నిత‌త్వం భ‌విష్య‌త్తులోనూ ప్ర‌జ్వ‌రిల్లుతుంద‌న్నారు. ఉగ్ర‌వాదులు దాడి చేసిన కొన్ని నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ తాజ్ హోట‌ల్‌ను రిపేర్ చేశారు. ఆ రోజు జ‌రిగిన దాడిలో ఆ హోట‌ల్‌లోనే 31 మంది మ‌ర‌ణించారు.  


logo