సోమవారం 01 జూన్ 2020
National - May 08, 2020 , 15:08:12

యువ‌ సీఈవో కంపెనీలో ర‌త‌న్ టాటా పెట్టుబ‌డి

యువ‌ సీఈవో కంపెనీలో  ర‌త‌న్ టాటా పెట్టుబ‌డి

టాటా గ్రూప్ ఫౌండర్, పారిశ్రామికవేత్త రతన్ టాటా.. ఈయ‌న ఏ జెన‌రేష‌న్‌కి అయినా ఆద‌ర్శంగా నిల‌చిపోయే వ్య‌క్తి. పెట్టుబ‌డుల్లో ముందుండే సాహ‌స‌వేత్త‌. కొంత‌మంది పారిశ్రామిక వేత్త‌ల‌ను త‌న‌లాగ త‌యారు చేయాల‌నుకునే మంచి మ‌నిషి. ప్ర‌స్తుతం ఆ ప‌నిలోనే ఉన్నారు. ఇటీవ‌లె మ‌రో ఆణిముత్యాన్ని తీర్చిదిద్ది ప‌నిలో ప‌డ్డారు ర‌త‌న్‌. ముంబైలోని  యంగ్ ఆంత్రప్రెన్యూర్ అర్జున్ దేశ్‌పాండే కు చెందిన జెనరిక్‌ ఆధార్‌లో 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు. అర్జున్ దేశ్‌పాండే రెండేండ్ల క్రితం రూ. 15 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో 'అర్జున్ జెనెరిక్ ఆధార్ ఫార్మ‌సీ-అగ్రిగేట‌ర్' అనే సంస్థ‌ను స్థాపించి విజ‌య‌వంతంగా ర‌న్ చేస్తున్నాడు. అర్జున్ మేధాశ‌క్తి, అనుభ‌వాన్ని బ‌ట్టి వ‌య‌సులో పెద్ద అనుకుంటారేమో. ఇంకా టీనేజ్‌లోనే ఉన్నాడు. 18 ఏండ్ల అర్జున్ జెనెరిక్ ఔష‌ధాల‌ను త‌యారీదారుల నుంచి నేరుగా చిల్ల‌ర వ్యాపారుల‌కు అందిస్తున్నాడు. త‌క్కువ ఖ‌ర్చుతో ఔష‌ధాల‌ను అందించ‌డం దీని ముఖ్య ఉద్దేశం.


logo