బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 15:26:50

బీఎస్పీ, జేపీఎస్‌తో కలిసి బీహార్ ఎన్నికల్లో పోటీ: ఆర్ఎల్ఎస్పీ

బీఎస్పీ, జేపీఎస్‌తో కలిసి బీహార్ ఎన్నికల్లో పోటీ: ఆర్ఎల్ఎస్పీ

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), జనవాడి పార్టీ సోషలిస్టు(జేపీఎస్)తో కలిసి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. ఇరు పార్టీల నేతలతో కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చిస్తామని చెప్పారు. బీహార్‌లో ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి ఆర్ఎల్ఎస్పీ వైదొలగింది. త్వరలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేపీఎస్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరు పార్టీల నేతల సమక్షంలో  ఉపేంద్ర కుష్వాహా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 28న తొలిదశ, నవంబర్ 3న రెండో దశ, 7న మూడో దశ పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 10న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo