శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 12:13:17

వ్య‌వ‌సాయ బిల్లుల‌పై ఆర్జేడీ వినూత్న నిర‌స‌న‌.. వీడియో

వ్య‌వ‌సాయ బిల్లుల‌పై ఆర్జేడీ వినూత్న నిర‌స‌న‌.. వీడియో

ప‌ట్నా: ‌కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షాల అభ్యంత‌రాల‌ను లెక్క‌చేయ‌కుండా ఏక‌ప‌క్షంగా పార్ల‌మెంటు ఆమోద‌ముద్ర వేయించుకున్న వ్య‌వ‌సాయ బిల్లులను ఆర్జేడీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ది. ఆ బిల్లులు పార్ల‌మెంటు ఆమోదం పొందిన నాటి నుంచి రోజుకో రీతిన నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న‌ది. శుక్ర‌వారం కూడా ప‌ట్నాలో ఆర్జేడీ నేత‌లు తేజ‌స్వియాద‌వ్‌, తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ కార్య‌క‌ర్త‌లతో క‌లిసి వినూత్న రీతిలో భారీ నిర‌స‌న ర్యాలీ తీశారు. 

తేజ‌స్వియాదవ్ స్వ‌యంగా ట్రాక్ట‌ర్ న‌డుపుతుంటే ఆయ‌న సోద‌రుడు తేజ్‌ప్ర‌తాప్ యాద‌వ్ ట్రాక్ట‌ర్ టాప్‌పై కూర్చుని ర్యాలీలో పాల్గొన్నారు. కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి వ్య‌వ‌సాయ బిల్లుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఆ ర్యాలీకి సంబంధించిన దృశ్యాల‌ను కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.          ‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo