ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 12:32:39

అధికారంలోకి వ‌స్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు! ఆర్జేడీ మేనిఫెస్టో

అధికారంలోకి వ‌స్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు! ఆర్జేడీ మేనిఫెస్టో

పాట్నా : బీహార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ర్టీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ) శ‌నివారం ఉద‌యం ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా తేజ‌స్వి యాద‌వ్ మాట్లాడుతూ.. ఆర్జేడీ అధికారంలోకి వ‌స్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. బీహార్‌ను దేశానికి ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌ట‌మే ఆర్జేడీ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ మాదిరి 19 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని అస‌త్య‌పు హామీ ఇవ్వ‌మ‌ని తేల్చిచెప్పారు. పాల‌న‌లో సీఎం నితీశ్ కుమార్ విఫ‌ల‌మ‌య్యారు. నిరుద్యోగం, క‌రోనా, వ‌ల‌స‌ల నివార‌ణ‌లో నితీశ్ విఫ‌ల‌మ‌య్యార‌ని తేజ‌స్వి యాద‌వ్ పేర్కొన్నారు. 

243 స్థానాలున్న శాసనసభకు మూడుదశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, 7 తేదీల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 10న ఫలితాలు వెల్లడిస్తారు.