బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 20:12:46

రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకుల ప్రవేశాలు రద్దు

రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకుల ప్రవేశాలు రద్దు

ఢిల్లీ: రేపట్నుంచి రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకుల ప్రవేశాలను అధికారులు రద్దుచేశారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సందర్శకులకు అనుమతిని నిరాకరించారు. కోవిడ్‌-19 వ్యాప్తితో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రపతిభవన్‌, మ్యూజియం, మొఘల్‌గార్డెన్స్‌ వంటి వాటిలోకి సందర్శకుల అనుమతులు రద్దు చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రవేశాలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు ప్రకటించాయి. ఢిల్లీలో ఇప్పటివరకు ఆరు కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. మార్చి 31వ తేదీ వరకు అన్ని పాఠశాలలు, కాలేజీలు, సినిమాహాళ్లు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు.


logo