ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 16:16:19

గుల్మార్గ్‌లో అరుదైన సోవియ‌ట్ కాలంనాటి రైఫిల్ ల‌భ్యం

గుల్మార్గ్‌లో అరుదైన సోవియ‌ట్ కాలంనాటి రైఫిల్ ల‌భ్యం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని గుల్మార్గ్‌లో సోవియ‌ట్ యూనియ‌న్ కాలంనాటి అరుదైన ఆయుధం డ్రాగునోవ్ స్నిప‌ర్ రైఫిల్‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. బారాముల్లాలోని గుల్మార్గ్ ఎగువ ప్రాంతంలో ఉన్న మార్ప‌త్రి అట‌వీ ప్రాంతంలో భారీగా ఆయుధాలున్నాయ‌నే స‌మాచారంతో శ‌నివారం ఉద‌యం గాలింపు చేప‌ట్టామ‌ని ఆర్మీ ప్ర‌తినిధి క‌ల్ రాజేష్ క‌లియా వెల్ల‌డించారు.

ఇందులో భాగంగా మ్యాగ‌జైన్స్‌తోపాటు ఒక డ్రాగునోవ్ స్నిప‌ర్ రైఫిల్‌, 194 ఏకే-47 రౌండ్లు, 10 రైఫిల్ గ్రెనేడ్లు, రెండు ఐఈడీ స‌ర్క్యూట్లు ల‌భించాయ‌ని చెప్పారు. 


logo