శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 17:27:48

సెర్చ్ ఆప‌రేష‌న్‌లో సోవియ‌ట్ కాలం నాటి రైఫిల్ స్వాధీనం

సెర్చ్ ఆప‌రేష‌న్‌లో సోవియ‌ట్ కాలం నాటి రైఫిల్ స్వాధీనం

శ్రీ‌న‌గ‌ర్ : జ‌మ్ముక‌శ్మీర్ గుల్మార్గ్ ప్రాంతంలో భ‌ద్ర‌తా ద‌ళాల సిబ్బంది నేడు సెర్చ్ ఆప‌రేష‌న్‌ను చేప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా అరుదైన రైఫిల్ ఒక‌టి దొరికింది. సోవియట్ కాలం నాటి డ్రాగూనోవ్ స్నిపర్ రైఫిల్‌ను భ‌ద్ర‌తా సిబ్బంది క‌నుగొని స్వాధీనం చేసుకుంది. అట‌వీ ప్రాంతంలో ఆయుధాలు ఉన్నాయ‌న్న స‌మాచారం మేర‌కు బారాముల్లాలోని గుల్మార్గ్ ఎగువ ప్రాంతాలలో భ‌ద్ర‌తా సిబ్బంది గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా ప‌లు మాగ్జిన్‌ల‌తో పాటు ఒక డ్రాగూనోవ్ స్నిపర్ రైఫిల్, 194 ఎకె -47 రౌండ్లు, 10 రైఫిల్ గ్రెనేడ్లు, రెండు ఐఈడి సర్క్యూట్లను స్వాధీనం చేసుకున్నారు.


logo