మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 09:17:18

కర్ణాటకలో అరుదైన పాము..!

కర్ణాటకలో అరుదైన పాము..!

బెళగాని : కర్ణాటక రాష్ట్రంలోని బెళగాని నగరంలో ఉన్న ఉద్యమ్‌బాగ్‌ పారిశ్రామికవాడలో ఓ అరుదైన పాము దర్శన మిచ్చింది. పారిశ్రామికవాడలోని స్థానికులు దీనిని గుర్తించారు. నల్లటి చర్మంపై తెల్లటి మచ్చలతో ఈ అరుదైన పాము ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిని బ్రైడల్‌ పాము అని పిలుస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పాము కనిపించడం ఇదే అరుదు అని పలువురు స్థానికులు చెబుతున్నారు.

సాధారణంగా ఈ పాము రాత్రివేళల్లో మాత్రమే బయటికి వస్తుందని చెప్పారు. ఇది ఆహారం కోసం కేవలం రాత్రి వేళలోనే వెతుక్కుంటుంది. ఇది షికారి పాము కాదని వారు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo