బుధవారం 15 జూలై 2020
National - Jul 01, 2020 , 15:32:29

అంద‌మైన పాము.. అరుదైన పాము

అంద‌మైన పాము.. అరుదైన పాము

పామును చూస్తేనే వ‌ళ్లు జ‌ల్ద‌రిస్తుంది. అలాంటిది అంద‌మైన పాము అంటే ఏం అనిపించ‌దా ఏంటి. ఒక‌సారి పాము అన్నాక ఏదైనా ఒక‌టే. కానీ ఈ పాము అలా కాద‌ట‌. చూస్తే వావ్ అనాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇది ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని దుధ్వా నేష‌న‌ల్ పార్క్‌లో ఎంతో అరుదైన పాముగా గుర్తించారు.

రెండు రోజుల క్రితం ల‌క్షింపూర్ ఖేరీలో ఉన్న అభ‌యార‌ణ్యంలో అట‌వీ సిబ్బంది కంట‌ప‌డింది. మిల‌మిల మెరిసే చ‌ర్మంతో ఎంతో అందంగా ఉన్న ఈ పాముకి ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి నెటిజ‌న్ల నుంచి అద్భుత‌మైన స్పంద‌నే వ‌చ్చింది. దీని శాస్త్రీయ‌నామం వ‌చ్చేసి  'ఒలిగోడోన్ ఖెరినెన్సిస్'‌‌. ఇలాంటి పాముని 1936లో మొట్ట‌మొద‌టి సారి చూశామ‌ని నిపుణులు చెబుతున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo