సోమవారం 06 జూలై 2020
National - Jun 19, 2020 , 12:19:10

మ‌సీదులో ఎన్‌కౌంట‌ర్‌.. ప‌విత్ర‌త దెబ్బ‌తిన‌కుండా స‌క్సెస్‌ఫుల్ ఆప‌రేష‌న్‌

మ‌సీదులో ఎన్‌కౌంట‌ర్‌.. ప‌విత్ర‌త దెబ్బ‌తిన‌కుండా స‌క్సెస్‌ఫుల్ ఆప‌రేష‌న్‌

 హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత జోరుగా కొన‌సాగుతోంది. గ‌త 24 గంట‌ల్లో ఎనిమిది మంది ఉగ్ర‌వాదుల‌ను ముట్టుబెట్టారు. షోఫియాన్‌, పాంపోర్ జిల్లాల్లో జ‌రిగిన రెండు ఎన్‌కౌంట‌ర్ల‌లో.. ఎనిమిది మంది ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. పాంపోర్‌లోని ఓ మ‌సీదులో ఉన్న ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల్ని .. భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్చి చంపాయి. అయితే మ‌సీదుపై దాడిలో ఎటువంటి ఫైరింగ్ కానీ, ఐఈడీల‌ను కానీ వాడ‌లేదు.  కేవ‌లం పొగ చిమ్మే టియ‌ర్ షెల్స్‌ను వాడిన‌ట్లు పోలీసులు తెలిపారు.  ఎదురుకాల్పుల స‌మ‌యంలో మ‌సీదు ప‌విత్ర‌త‌ను కాపాడేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు పోలీసులు చెప్పారు. 

మీజ్ పాంపోర్ ఆప‌రేష‌న్ స‌మ‌యంలో పోలీసులు పూర్తి చ‌ర్య‌లు పాటించారు.  మ‌సీదు ప‌విత్ర‌త‌కు భంగం క‌ల‌గ‌కుండా చూశారు. ఈ ఆరేష‌న్ సాగిన తీరు ప‌ట్ల స్థానిక ప్ర‌జ‌లు, మ‌సీదు క‌మిటీ స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేశారు.  జిల్లా పోలీసు చీఫ్ తాహిర్ చూపిన స‌హ‌నం, ధైర్యం ప‌ట్ల కూడా ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెప్పారు. ఆప‌రేష‌న్‌లో నిమ‌గ్న‌మైన ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ ద‌ళాల‌ను కూడా పోలీసు చీఫ్ దిల్‌బాగ్ సింగ్‌ మెచ్చుకున్నారు. 

సాధార‌ణంగా ఉగ్ర‌వాదులు దాక్కున్న ప్రాంతాన్ని చేధించేందుకు.. భ‌ద్ర‌తా ద‌ళాలు ఎక్కువ‌గా ఐఈడీల‌ను వాడుతుంటారు లేదా ఫైరింగ్‌కు పాల్ప‌డుతుంటారు. కానీ పాంపోర్ ఆప‌రేష‌న్ అత్యంత అరుదైన‌ద‌ని పోలీసులు చెబుతున్నారు. కేవ‌లం టియ‌ర్ స్మోక్ షెల్స్‌తోనే ఆప‌రేష‌న్ నిర్వ‌హించి.. ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్లు తెలిపారు.  ఉగ్ర‌వాదులు ఉన్న స‌మాచారం తెలుసుకున్న పోలీసులు.. నిన్న ఉద‌యం నుంచి ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు. సోఫియాన్‌లో అయిదుగురు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చ‌గా,  పాంపోర్‌లో ముగ్గుర్ని చంపేశారు.  logo