ఆదివారం 05 జూలై 2020
National - Jun 18, 2020 , 06:59:29

అరుదైన హాగ్ బ్యాడ్జ‌ర్ పిల్ల‌లు.. ముఖం పందిలా, ఒళ్లు ఎలుగులా!

అరుదైన హాగ్ బ్యాడ్జ‌ర్ పిల్ల‌లు.. ముఖం పందిలా, ఒళ్లు ఎలుగులా!

 అగ‌ర్త‌లా: త‌్రిపుర రాష్ట్రం ధ‌లాయ్ జిల్లా అట‌వీ ప్రాంతంలోని స‌లేమా గ్రామంలో అరుదైన హాగ్ బ్యాడ్జ‌ర్ పిల్ల‌లు క‌నిపించాయి. త్రిపుర రాజ‌ధాని అగర్త‌లాకు తూర్పున 90 కిలోమీట‌ర్ల దూరంలోని స‌లేమా గ్రామానికి చెందిన కొంద‌రు స్థానికులు వింత‌గా ఉన్న మూడు‌ హాగ్ బ్యాడ్జ‌ర్ పిల్ల‌ల‌ను చూసి అట‌వీ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో అక్క‌డికి చేరుకున్న అధికారులు అవి అరుదైన హాగ్ బ్యాడ్జ‌ర్ జాతికి చెందిన కూన‌ల‌ని గుర్తించారు. అనంత‌రం వాటిని సెప‌హిజాలా వ‌న్యప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రానికి త‌ర‌లించారు. 

హాగ్ బ్యాడ్జ‌ర్‌లు అంత‌రించిపోతున్న అరుదైన జీవ జాతుల జాబితాలో ఉన్నాయ‌ని అట‌వీ అధికారులు చెప్పారు. వీటి ముఖం పందిని పోలి ఉంటుంద‌ని, మిగ‌త శ‌రీరం మొత్తం ఎలుగుబంటిలా ఉంటుంద‌ని వారు తెలిపారు. ఇవి గ‌రిష్టంగా 9 నుంచి 10 కిలోల వ‌ర‌కు బ‌రువు పెరుగుతాయ‌ని చెప్పారు. ఈ అరుదైన జీవులు శాఖాహారం, మాంసాహారం రెండూ తీసుకుంటాయ‌ని తెలిపారు. అయితే త్రిపుర అట‌వీ ప్రాంతంలో హాగ్ బ్యాడ్జ‌ర్‌ల ఉనికి బ‌య‌ట‌ప‌డ‌టం ఇదే తొలిసారి అని చెప్పారు.nbsp;


logo