శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 14:18:37

800 కిలోల అరుదైన చేప‌.. అక్ష‌రాల రూ. 20 ల‌క్ష‌లు!

800 కిలోల అరుదైన చేప‌.. అక్ష‌రాల రూ. 20 ల‌క్ష‌లు!

800 కిలోల బ‌రువున్న చిల్‌శంక‌ర్ చేప వెస్ట్ బెంగాల్‌లోని దిఘాలో ప‌ట్టుబ‌డింది. ఈ సీజ‌న్‌లో అత్యంత రుచిక‌ర‌మైన ప‌దార్థంగా చిల్‌శంక‌ర్ చేప మారింది. మత్స్యకారులు చేప‌లు ప‌డుతుండ‌గా వ‌ల‌కు ఈ చేప చిక్కుకోవ‌డంతో వారంతా షాక్ అయినా త‌ర్వాత వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. ఈ చేప‌ చాలా అరుదైన‌ది. మత్స్యకారులే ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేదు. ఇది కొంచెం ఓడ‌లా క‌నిపిస్తుంది. ఒరిస్సాకు చెందిన ఒక వ్య‌క్తి యాజ‌మాన్యంలోని ట్రాల‌ర్‌లో ఈ చేప ప‌ట్టుబ‌డింది. దీన్ని చూడ్డానికి ప్ర‌జ‌లు, స్థానిక ప‌ర్యాట‌కులు గుమిగూడారు.

ఈ చేప బ‌రువు కార‌ణంగా మిగ‌తా మాములు చేప‌ల‌ను త‌ర‌లించ‌లేక‌పోయారు. ఇది చాలా బ‌రువు ఉంటుంది. ఒక ప్ర‌దేశం నుంచి మ‌రొక ప్ర‌దేశానికి త‌ర‌లించ‌డానికి తాళ్లను ఉప‌యోగించారు. దీన్ని మార్కెట్‌కు తీసుకెళ్లిన త‌ర్వాత చేప‌ల‌ను హోల్‌సేల్ మార్కెట్‌లో కిలోకు రూ. 2100 చొప్పున వేలం వేశారు. అంటే చేప మొత్తం ధర రూ. 20 లక్షల పైమాటే! అక్కడ స్థానిక మ‌త్స్య‌కారుడు అజిరుల్ మాట్లాడుతూ ఇంత పెద్ద అరుదైన చేప‌ల‌ను మనం ఎప్పుడూ చూడ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఈ చేప‌ స్కేల్‌, ఆయిల్‌ను ఔష‌ధాల త‌యారీకి ఉప‌యోగిస్తారు. క‌రోనా టైంలో ఈ చేప దొర‌క‌డం ల్యాట‌రీ త‌గ‌ల‌డం క‌న్నా ఎక్కువే అంటున్నారు. 

    


logo