శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 13, 2020 , 03:05:04

ఆకాశంలో 20 రోజుల అద్భుతం

ఆకాశంలో 20 రోజుల అద్భుతం

  • రేపటి నుంచి భారత్‌లో కనువిందు చేయనున్న నియోవైజ్‌ తోకచుక్క

భువనేశ్వర్‌: అంతరిక్షంలో లెక్కకు అందని తోకచుక్కలుంటాయి. అవన్నీ కనిపించవు. అప్పడప్పుడు ఉల్కలను చూసి తోకచుక్కలు అనుకుంటాం..అవి ఇలా కనబడి అలా మాయవుతాయి. కానీ ఓ తోకచుక్క భారతీయులకు 20 రోజులు కనువిందు చేయనుంది. సాయంత్ర లేలేత చీకట్లు అలుముకుంటున్న వేళ ప్రతిరోజు 20 నిమిషాల పాటు కనిపించనుంది. దాని పేరు నియోవైజ్‌. దీనిని శాస్త్రవేత్తలు  ఇటీవలే కనుగొన్నారు. 5 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ తోకచుక్క తన కక్ష్యలో తిరుగుతూ భూమికి సమీపంగా వస్తున్నది. ఈ క్రమంలో భారత్‌లో వాయువ్యం దిశలో మంగళవారం నుంచి కనిపించనుంది. దానిని చూడటానికి ఎలాంటి  పరికరాలు అవసరం లేదని శాస్త్రవేత్త సభేందు పట్నాయక్‌ తెలిపారు.


logo