గురువారం 28 మే 2020
National - May 24, 2020 , 00:24:02

50 ఏండ్ల తర్వాత ఈల వేసిన ధోల్‌

50 ఏండ్ల తర్వాత ఈల వేసిన ధోల్‌

సూరత్‌, మే 23: ఏనాడో అంతరించిపోయిందని భావిస్తున్న అడవి కుక్క ధోల్‌ మళ్లీ కనిపించింది. గుజరాత్‌లోని సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో విస్తరించి ఉన్న వాన్స్‌దా జాతీయపార్కులో ఇటీవల ఈ జాతి కుక్కలు రెండు దర్శనమిచ్చాయి. గత 50 ఏండ్లలో ఈ కుక్కలు కనిపించటం ఇదే మొదటిసారి. పార్కులో ఏర్పాటుచేసిన కెమెరాల్లో రెండు ధోల్‌ల కదలికలు రికార్డు అయ్యాయని దక్షిణ దాంగ్స్‌ డివిజన్‌ డిఫ్యూటీ కన్జర్వేటర్‌ దినేశ్‌ రబారీ తెలిపారు. ఈ కుక్కలు ఈలలాంటి ఒక విచిత్రమైన శబ్దం చేస్తాయి. దాంతో వాటిని ఈలవేసే కుక్కలు అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇవి అంతరించిపోయే దశలో ఉండటంతో రెడ్‌ లిస్టులో చేర్చారు. చూడటానికి జకాల్‌ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇది కొంత ప్రత్యేకమైనదని దినేశ్బ్రారీ తెలిపారు.  


logo