ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 17:23:09

ఆమెను పెండ్లి చేసుకుంటా.. కేర‌ళ హైకోర్టుకు రేపిస్ట్ ఆఫ‌ర్‌!

ఆమెను పెండ్లి చేసుకుంటా.. కేర‌ళ హైకోర్టుకు రేపిస్ట్ ఆఫ‌ర్‌!

తిరువ‌నంత‌పురం: మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం కేసులు జైలుశిక్ష అనుభ‌విస్తున్న రాబిన్ వ‌డ‌క్కుంచేరి అనే ఖైదీ కేర‌ళ హైకోర్టుకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. తాను త‌న చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలిని వివాహం చేసుకుంటాన‌ని, త‌న కార‌ణంగా అమెకు జ‌న్మించిన చిన్నారి సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు చూసుకుంటాన‌ని చెప్పాడు. పెండ్లి ఏర్పాట్లు చేసుకోవ‌డం కోసం త‌న‌కు రెండు నెల‌లు బెయిల్‌ మంజూరు చేయాల‌ని కోరాడు. 

అయితే, రాబిన్ వ‌డ‌క్కుంచేరి ప్ర‌తిపాద‌న‌ను కోర్టు తిర‌స్క‌రించింది. 20 ఏండ్ల జైలుశిక్ష నుంచి మిన‌హాయింపు పొంద‌డం కోసం పిటిష‌న‌ర్ ఎత్తుగ‌డ వేస్తున్నాడ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఇప్పుడు పిటిష‌న‌ర్ ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రిస్తే ఇక నుంచి ప్ర‌తి అత్యాచార దోషి బాధితురాలిని పెండ్లి చేసుకుంటానంటూ శిక్ష‌లు త‌ప్పించుకునే అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల అలాంటి సంప్ర‌దాయ‌న్ని తాము ప్రోత్స‌హించ‌బోమ‌ని కోర్టు స్ప‌ష్టంచేసింది.

దీంతో బాధితురాలు కూడా త‌న‌ను పెండ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉంద‌ని పిటిష‌న‌ర్ రాబిన్ కోర్టుకు తెలిపాడు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి కోర్టులో స్టేట‌స్ రిపోర్టు దాఖ‌లు చేసిన పోలీసులు సైతం బాధితురాలు ప్ర‌స్తుతం తిరిగి చుదువుకుంటున్న‌ద‌ని, త‌న జీవితాన్ని పున‌ర్నిర్మించుకోవ‌డానికి ఇది మంచి అవ‌కాశ‌మ‌ని పేర్కొన్నారు. దీంతో పోలీసుల నుంచి స్ప‌ష్ట‌మైన నివేదిక కోరిన కోర్టు విచార‌ణ‌ను జూలై 24కు వాయిదా వేసింది. 

కాగా, కేర‌ళ‌లోని ఓ చ‌ర్చిలో ఫాద‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ రాబిన్ వ‌డ‌క్కుంచేరి 2016లో 16 ఏండ్ల బాలిక‌ను లోబ‌ర్చుకుని అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీంతో బాలిక‌కు ప్రెగ్నెన్సీ వ‌చ్చి బిడ్డ‌ను కూడా క‌న్న‌ది. అనంత‌రం త‌న‌కు సంబంధం లేద‌ని చ‌ర్చి ఫాద‌ర్ ముఖం చాటేయడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎన్ఏ టెస్టులో బిడ్డ‌కు తండ్రి రాబిన్ అని తేల‌డంతో థ‌ల‌స్పెరిలోని పోక్సో కోర్టు అత‌నికి 20 ఏండ్ల జైలుశిక్ష విధించింది.                      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo