సోమవారం 01 జూన్ 2020
National - May 24, 2020 , 10:26:21

ఎడారిని తలపిస్తున్న రాణి చెన్నమ్మ సర్కిల్‌

ఎడారిని తలపిస్తున్న రాణి చెన్నమ్మ సర్కిల్‌

బెంగళూరు: హుబ్లీలోని రాణి చెన్నమ్మ సర్కిల్‌ ఎడారిని తలపిస్తున్నది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ఎప్పుడూ జనాలతో కిక్కిరిసి పోయే హుబ్లీలోని రాణి చెన్నమ్మ సర్కిల్‌ జన సంచారం లేక ఎడారిలా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో నాలుగు ఆదివారాలు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది. ఇందులోభాగంగా ఈ రోజు లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటికీ బెంగళూరులో ఈ రెండు ఆదివారాలపాటు ముందే నిశ్చయమైన వివాహాలకు అనుమతించింది. 


logo